108 ఉద్యోగులకు విజయమ్మ హామీ

పులివెందుల, 3 అక్టోబర్‌ 2012: అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న 108 వైద్య ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ హామీ ఇచ్చారు. 108 ఉద్యోగుల రాష్ట్ర యూనియన్‌ నాయకులు బుధవారంనాడు ఇక్కడ విజయమ్మను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలను ఆదుకోవాలన్న సదాశయంతో మహానేత వైయస్‌ఆర్‌ 108 సేవలను ప్రారంభించారని గుర్తు చేశారు. అలాంటి విభాగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికే ఇబ్బందులు కలగడం విచారకరమన్నారు. వారి సమస్యలపై తాను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళ పరిష్కరించమని కోరతానన్నారు.

Back to Top