రాలీలో వైయస్ఆర్‌సిపి అభిమానుల కోలాహలం

రాలీ (ఉత్తర కరోలినా- యుఎస్ఎ) :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల సందర్భంగా అమెరికాలోని ఉత్తర కరోలినా రాజధాని రాలీలో పార్టీ మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. యువ నేత శ్రీ జగన్‌పై అన్యాయంగా పెట్టిన పలు కేసుల్లో ఆధారాలు చూపించడంలో సిబిఐ విఫలం అయిందని వక్తలు హర్షం వ్యక్తంచేశారు. శ్రీ జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టి వేధించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి 'ధర్మ విజేత'గా బయటికి వచ్చారని ఈ సందర్భంగా పలువురు వక్తలు సంతోషం వ్యక్తంచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరూ త్వరలోనే సమైక్యాంధ్రే కావాలంటూ బయటికి వచ్చి స్పష్టంగా మాట్లాడతారని ఉత్తర కరోలినాలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు యువనేత శ్రీ వైయస్‌ జగన్‌ ఒక్కరే వారు ధీమా పేర్కొన్నారు.

శ్రీ జగన్‌ విడుదల సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో భాగంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ అభిమానులు, మద్దతుదారులు‌ లాభాపేక్ష లేకుండా వికలాంగులు, మానసిక వికలాంగులైన పిల్లలకు సేవలు అందిస్తున్న అనురాగ్‌ ఫౌండేషన్‌కు విరాళం అందజేశారు. రాష్ట్రాన్ని ఎప్పటికీ సమైక్యంగా ఉంచడంలో యువనేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గొప్పగా ముందుకు సాగాలని పార్టీ మద్దతుదారులంతా అభిలషించారు.

ఈ సంబరాల్లో  అక్కనంబట్టు నరసింహారెడ్డి, ఆవుల శ్రీనివాస, బొమ్ము శ్రీనివాస, గడ్డం నర్స, కల్యాణ్‌ బొడ్డపాటి, కట్టంరెడ్డి సుబ్బ, కొక్కంటి ప్రసన్న, కుర్లె రామమోహన్‌రెడ్డి, కుర్లె సుభాకర్, కుటుంబరావు, మాలె మహీపాల్, ముండ్ల కృష్ణారెడ్డి, ముతకన పురుష్, నాగిరెడ్డి, నారాయణ చింతపట్ల, నర్రావుల నరసింహ, నేమాని సురేష్, పాయరెడ్డి ప్రతాప్, పెరుగుపల్లి శ్రీకాంత్, ప్రదీప్, శరత్, సోంపురం జీవన్, శ్రీనాథ్‌బాబు, సూదిని సాయి తదితరులు ఉత్సాహంగా పాల్టొన్నారు.

Back to Top