ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం

 ఫిలడెల్ఫియా : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికన్‌ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలోని డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్‌ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. సెప్టెంబర్̤ 8వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగిన ఈ శిబిరంలో 150 మంది రక్త దానం చేశారు. పెన్సిల్వేనియాలోని రాడిసన్ హొటల్‌లో నిర్వహించిన ఈ శిబిరానికి ఈశాన్య అమెరికాలో నివాసం ఉంటున్న వైయస్‌ఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని, సెప్టెంబర్‌ 11 న డబ్ల్యుటిసి మృతుల వార్షిక సంస్మరణ కార్యక్రమంగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని మాజీ ఎంపి జ్ఞానేంద్రరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

శిబిరం సమన్వయకర్త డాక్టర్‌ రాఘవరెడ్డి, ఫౌండేషన్‌ అధ్యక్షుడు రామిరెడ్డి ఆళ్ళ, రాజేశ్వర్‌రెడ్డి గంగసాని, శ్రీనివాస్‌ ఈమని, రామ్‌ కల్లం, శివ మేక, జ్యోతిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వేదనపర్తి, నగేష్‌ ముక్కమల్ల, భోనోజి, రామ్‌, శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్‌ లక్కసాగరం, శరత్‌ మందపాటి, విష్ణు కోటంరెడ్డి, అంజన్‌ కర్నాటి, సహదేవ్‌రెడ్డి, అన్నారెడ్డి, సతీష్‌ రాచమడుగు, శ్రీధర్‌రెడ్డి, మధు గోనిపాటి, ప్రతాప్‌, ఆనంద్‌, శశిధర్‌, తాతారావు, శివ, బాల, అజయ్‌ దేవభక్తుని, ప్రసాద్‌ సానికొమ్ము, నిరంజన్‌ యర్రం, రఘురామిరెడ్డి, శ్రీనివాస్‌ పడాల, గీతాంజలి, లక్ష్మి ఈమని, సంధ్య గంగసాని, నిర్మల బైరెడ్డి, నవీన్‌, స్వరూప్‌, సందీప్‌, విద్యాధర్‌, మనోహర్‌, వెంకట్‌రెడ్డి తదితరులు ఈ బృహత్‌ రక్తదాన శిబిరం విజయవంతం అయ్యేలా విశేషంగా కృషి చేశారు. శిబిరాన్ని చక్కని క్రమశిక్షణతో సమన్వయం చేసిన డాక్టర్‌ రాఘవరెడ్డిని ప్రతి ఒక్కరూ అభినందించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ, వైయస్‌ ప్రారంభించిన పథకాలను ముందుకు తీసుకుపోతున్న డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్‌ కృషిని ప్రశంసించారు. మీడియా కవరేజి అందించిన ఇమాం నేత్రపల్లి (సాక్షి టీవీ), సంపత్‌ (టీవీ 5), కార్యక్రమం ఫొటోలు తీసిన నవీన్‌ బుచ్చి, శ్రీధర్‌రెడ్డి, ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అతిథులందరికీ శిబిరం సమన్వయకర్త రాఘవరెడ్డి స్వాగతం పలికారు. వలంటీర్లకు, 'మానవ సేవే మాధవ సేవ' స్ఫూర్తితో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేసిన వారికి టీ షర్టులు అందజేసిన బ్రూక్‌ గ్లెన్‌ ఆసుపత్రి సీఈఓ నీల్‌ కల్లహన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

ప్రతి సంవత్సరం ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని వైయస్‌ అభిమానులంతా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

Back to Top