అందుకే చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెప్పారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలరాజు
 

అసెంబ్లీ:  ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని చంద్రబాబు విస్మరించడంతో గత ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తూర్పారబట్టారు. సోమవారం సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. నాడు టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కారు. ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించానని చెబుతున్నాడు. ఆ రోజు ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికి తెలుసు. అందుకే ఆ రోజు ఎస్సీ, ఎస్టీలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పారు. 
 

Back to Top