వెలంపల్లికి వైయ‌స్ఆర్‌సీపీ నేతల పరామర్శ

విజ‌య‌వాడ‌: సీఎం వైయ‌స్ జగన్‌పై దాడి జరిగిన ఘటనలో గాయపడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును పలువురు నేతలు పరామ­ర్శిం­చారు. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వెలంపల్లి ఇంటికి వెళ్లి ఆయన కంటికి అయిన గాయం గురించి ఆరా తీశారు. డాక్టర్‌ను కలిసి చికిత్స పొందాలని సూచించారు. ఘటన జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సజ్జల వెంట రాజ్య­సభ సభ్యుడు ఆళ్ల అయోధ్య­రామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, కనకారావు మాదిగ, గుబ్బా చంద్రశేఖర్‌ ఉన్నారు.      
 

Back to Top