టీడీపీ నేత‌ల దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త మృతి

  చిత్తూరు జిల్లా బి.కొత్త‌కోట‌లో ఘ‌ట‌న‌

చిత్తూరు:  టీడీపీ నేత‌లు అధికారం కోల్పోయిన త‌మ స్వ‌భావాన్ని మార్చుకోవ‌డం లేదు. దాడులు కొన‌సాగిస్తూ విష సంస్కృతిని వీడ‌టం లేదు. చిత్తూరు జిల్లా బి.కొత్త‌కోట మండ‌లం వి.కొల్లేటివారిప‌ల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు దారుణానికి ఒడిగ‌ట్టారు. అర్ధ‌రాత్రి వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త వెంక‌ట‌ర‌మ‌ణ కుటుంబంపై టీడీపీ నేత‌లు దాడికి తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన వెంక‌ట‌ర‌మ‌ణ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. టీడీపీ డౌర్జ‌న్యాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top