విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా సింహాచలంలో అపూర్వ ప్రజాస్పందన కనిపించింది. వైయస్ జగన్ కాన్వాయ్ సింహాచలం చేరుకోగానే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. రహదారులన్నీ జనంతో నిండిపోయి ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలను లెక్కచేయకుండా ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైయస్ జగన్ కాన్వాయ్ వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు నడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వైయస్ జగన్ ముందుకు సాగగా, ప్రజలు జైకొడుతూ ఘన స్వాగతం పలికారు. పలువురు చేతుల్లో ‘థ్యాంక్యూ వైయస్ జగన్’ అని రాసిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆయనకు సంఘీభావం తెలిపారు. సింహాచలం నుంచి శ్రీకాకుళం వరకు వైయస్ జగన్‌కు లభించిన ప్రజాదరణ కూటమి ప్రభుత్వం సృష్టించిన ఆంక్షలు ప్రజల సంకల్పం ముందు నిలవలేవని మరోసారి స్పష్టం చేసిందని వైయస్ఆర్‌సీపీ పేర్కొంది.