తాడేపల్లి: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్థంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఇవాళ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ ఎక్స్ వేదికగా నివాళులర్పిస్తూ పోస్టు చేశారు. ‘దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయస్ జగన్ పోస్టు చేశారు.