వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన సభ పోస్టర్ ఆవిష్కరణ  

విజ‌య‌న‌గ‌రం:  అక్టోబర్ 15న‌ వికేంద్రీకరణకు మద్దతుగా త‌ల‌పెట్టిన‌ విశాఖ గర్జన సభ పోస్టర్ ను శుక్ర‌వారం విజయనగరంలో ఆవిష్క‌రించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు),  డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు (చిన్నశ్రీను), గజపతినగరం శాసన సభ్యులు బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల శాసన సభ్యులు  బడ్డుకొండ అప్పలనాయుడు, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, శాసన మండలి సభ్యులు ఇందుకురి రఘురాజు, జిల్లా  పార్టీ నాయకులు నెక్కల నాయుడు బాబు, కె.వి సూర్యనారాయణ రాజు, అశపు వేణు, రాజు తదితరులు పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. విశాఖ గ‌ర్జ‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ప్ర‌జాప్ర‌తినిధులు పిలుపునిచ్చారు.

Back to Top