అనకాపల్లి: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. విశాఖ డీసీసీ ప్రెసిడెంట్ గోవిందరాజు వైయస్ఆర్‌సీపీలో చేరారు. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో విశాఖ డీసీసీ ప్రెసిడెంట్ గొంపా గోవింద రాజు, విశాఖ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జీవీవీఎస్ కమలాకర రావు, పెందుర్తికి చెందిన ఎన్ ప్రసాదరావు (జేసీబీ ప్రసాద్) వైయస్ఆర్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.