రేపు వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్స‌వ‌ వేడుక‌లు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్ర‌వారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ వేడుక‌ల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటార‌ని చెప్పారు. వేడుక‌ల‌కు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు హాజ‌రు కావాల‌ని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.

తాజా ఫోటోలు

Back to Top