రోడ్డు నిర్మాణ ప‌నులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా  

చిత్తూరు: నగరి రూరల్ వీకేఆర్‌ పురం పంచాయ‌తీ లోని మీరాసాహెబ్ పాలెం గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా రోడ్డు నిర్మాణ ప‌నులు ప్రారంభించారు. ఈ గ్రామాన్ని రోజా దత్తత తీసుకొని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా  అన్ని వీధులకు, లోపల, బయట వచ్చి వెళ్ళే దారులలో మొత్తం కలిపి 620 మీటర్లు (10 అడుగుల  వెడల్పు రోడ్) ను తన సొంత నిధులు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 23.00 లక్షలతో ప‌నులు ప్రారంభించారు.  

Back to Top