’నీ డ్రామాలు తెలియనంత అమాయకులెవరూ లేరు’

  ఎంపీ విజయసాయి రెడ్డి 

   
 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్‌లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కాలం చెల్లిన ఆలోచనలకు ఎంత పదును పెట్టినా ప్రయోజనం ఉండదు బాబూ. అడ్డంగా దొరికి పోయావు. నేను రెండు రాష్ట్రాలు తిరుగుతున్నానని టి.డీజీపీకి కంప్లెయింట్‌ ఇప్పించావు. మరి వైజాగ్‌ వెళ్లడానికి డీజీపీలను అడగకుండా కేంద్రం అనుమతి ఎందుకు కోరావు? నీ డ్రామాలు తెలియనంత అమాయకులెవరూ లేరు’ అంటూ ట్వీట్‌ చేశారు.

 మరో ట్వీట్‌లో.. ’పేద పేద బిడ్డలు ఇంగ్లిష్‌ మీడియం చదవకుండా మొన్నటిదాకా కుట్రలు చేశాడు. నేడు పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్‌ గారు దేశంలోనే భారీ భూసేకరణ చేస్తే, అడ్డుకోవాలని రాళ్లు వేస్తున్నాడు. దొంగ ఫోటోలు పెట్టి మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నాడు’ అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top