చంద్రబాబు సభ్యత, సంస్కారం వదిలేశారు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారం అనే వస్త్రాలను విడిచేసి చంద్రబాబు నగ్నంగా చెలరేగిపోతున్నారని విమర్శించారు. కళ్లు, చెవులు మూసుకుని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో అని ఎద్దేవా చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయంతో తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రచారానికి వెళ్లలేదని విజయసాయిరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు  క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలకు విలువే లేదా? అని విజ‌య‌సాయిరెడ్డి ప్రశ్నించారు.

Back to Top