భూ సర్వేతో రైతులకు సంపూర్ణ న్యాయం

ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌– జగనన్న భూ హక్కు..భూ రక్ష పథకం ద్వారా రాష్ట్రంలో చేపడుతున్న భూముల రీ సర్వేతో రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఉదయభాను అధ్యక్ష ఉపన్యాసం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెళ్లి రోజు వైయస్‌ఆర్‌ ఎత్తిపోతల పథకాన్ని వేదాద్రిలో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోజు వైయస్‌ జగన్‌ జన్మదినం రోజు చరిత్రలో నిలిచిపోయే వైయస్‌ఆర్‌– జగనన్న శాశ్వత భూ హక్కు..భూ రక్ష పథకాన్ని మన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు. ఇది మనకు శుభ దినం. భూ సర్వే ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది రైతులకు శుభపరిణామం. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు బ్రిటిష్‌కాలంలో చేసిన సర్వే ఇవాళ మళ్లీ ప్రారంభించడం గొప్ప విషయం. గతంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సర్వే ప్రారంభించి ఆదిలోనే ఆపేశారు. ఇవాళ వైయస్‌ జగన్‌ డ్రోన్, శాటిలైట్స్‌తో భూ రీసర్వేను ప్రారంభించారు. భూతగాదాలు, రికార్డుల ట్యాంపరింగ్‌కు ఈ సర్వే చెక్‌ పెడుతుంది. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో సర్వే చేయిస్తున్నారు. గతంలో సర్వే చేయించుకోవాలంటే చెలానా కట్టినా..నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే వాళ్లం. ఇవాళ అలాంటి పరిస్థితిని స్వస్తి చెప్పి..గ్రామ సచివాలయంలోనే సర్వే పనులు పూర్తి అవుతాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో భూ సర్వే చేపట్టారు. జన్మదినం సందర్భంగా ఈ సర్వే చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గంలోని సమస్యలను కూడా సీఎం వైయస్‌ జగన్‌కు వివరిస్తాను. మన సమస్యలన్నీ సీఎం వైయస్‌ జగన్‌ పరిష్కారం చేస్తారని ఎమ్మెల్యే ఉదయభాను పేర్కొన్నారు.  జగనన్న మాట ఇస్తే..మడమ తిప్పడని, ఆరోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా ఏర్పాటు చేయాలని, ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, రైల్వే లైన్‌ను పాసింజర్‌ స్టాప్‌గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఉదయభాను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రభుత్వ జూనియర్‌కాలేజీకి నాడు– నేడు పథకం కింద శాశ్వత భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. 
 

Back to Top