ఎమ్మెల్యే రోజా నివాసంలో భోగి సంబరాలు

తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసంలో భోగి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రోజా భోగి మంటలు వెలిగించారు. నగరి మునిసిపల్  కార్యాలయంలో  రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో 95 మంది మునిసిపాలిటి పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.సచివాలయంలో సిబ్బంది కులమతాలకు అతీతంగా, రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా అర్హులైన వారందరికీ ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని ఎమ్మెల్యే ఆర్.కే.రోజా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఆదారంగా ఎంపికై సచివాలయంలో పనిచేస్తున్న వారంద‌రూ నిష్పక్షపాతంగా విధులు నిర్వ‌ర్తించాల‌ని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాన్ని అమలుచేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యా నికేతన్‌ విద్యా సంస్థల్లో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు భోగి సంబరాలు నిర్వహించారు.
 
 

Back to Top