నంద్యాల ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు నీచ‌రాజ‌కీయాలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్‌

క‌ర్నూలు: న‌ంద్యాల ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఏ నాడు మైనారిటీల‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.నారా హ‌మారా స‌భ‌లో ప్ర‌శ్నించిన ముస్లింల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టించిన వ్య‌క్తి చంద్రబాబు అని విమ‌ర్శించారు. నంద్యాల ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట‌నే స్పందించార‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో బాధ్యులైన సీఐ, కానిస్టేబుల్‌ను అరెస్టు చేయించార‌ని, వారికి బెయిల్ ఇప్పించింది టీడీపీకి చెందిన లాయ‌ర్లే అని పేర్కొన్నారు. తీరు మార్చుకోక‌పోతే చంద్ర‌బాబుకు మైనారిటీలు గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top