జైల్‌కు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం కావాలి

 ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: రాజధాని ఏర్పడే ప్రాంతం సమాచారాన్ని ముందుగానే చంద్రబాబు తన సహచరులకు అందించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. చంద్రబాబు సీఎం హోదాలో ఉంటూ ప్రభుత్వ రహస్యాలను చెప్పనని ప్రమాణం చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి తప్పుగా వ్యవహరించారు. ఇది శిక్ష్యార్హమైనది..చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
- రాజధాని ఇక్కడి నుంచి తరలిపోవడం లేదు. రాజధానిని మూడు ప్రాంతాలకు డివైడ్‌ చేస్తున్నారు. అందరిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు కర్నూలులో, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ విశాఖలో, ఇక్కడ లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఉంటుంది.
- బినామీ రైతులకు మేం న్యాయం చేయలేకపోవచ్చు. నిజమైన రైతులకు న్యాయం చేస్తాం. 
- అన్ని ప్రాంతాలను సంతృప్తి పరిచేందుకు జీఎన్‌ రావు కమిటీ నివేదికలు పరిశీలిస్తున్నాం. హైపవర్‌ కమిటీ నివేదికలు రావాలి. 

 

Back to Top