ఎస్సీ, ఎస్టీల పట్ల సీఎం వైయస్‌ జగన్‌ సానుకూలంగా ఉన్నారు

మంత్రి పెనిపే విశ్వరూప్‌

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సమస్యల పరిష్కారానికి హైపవర్‌ కమిటీ సమావేశం

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీల పట్ల సానుకూలంగా ఉన్నారని మంత్రి పెనిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సమస్యల పరిష్కారం కోసం హైపవర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. బాధితులకు న్యాయం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు చర్చించారు. బాధితులకు సత్వర న్యాయం చేయడమే హైపవర్‌ కమిటీ లక్ష్యమని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు.

సమావేశంలో హోం మంత్రి సుచరిత, మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి, ఉండవల్లి శ్రీదేవి, జగన్‌మోహన్‌రావు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top