పంచారామాల దర్శనం కార్తీకమాసంలో ఎంతో పుణ్యం

మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌
 

విజయవాడ:  కార్తీక మాసంలో పంచారామాల దర్శనంతో ఎంతో పుణ్యం ల‌భిస్తుంద‌ని  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ‘పంచారామస్‌’ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్ట్‌ కార్డులను మంత్రి బుధ‌వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపాలా శాఖా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి వారధిగా ఉంటుందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు, దేవాలయాల పేరుతో పోస్ట్‌కార్డులు ముద్రించడం చాలా సంతోషమన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల వలె ఏపీలో ఉన్న దేవాలయాలకు కూడా పోస్టల్ సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఒకేసారి వర్చ్యువల్‌గా పంచరామాలు దర్శించడం సంతోషమని తెలిపారు. మహాత్ముల గురించి తెలుసుకోవడం యువతకు చాలా అవసరమని చెప్పారు. 

Back to Top