చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు

 వైయ‌స్ఆర్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు 

నిమ్మగడ్డ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మండిప‌డ్డారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌పై చంద్ర‌బాబు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన‌ప్పుడే జిల్లాలో ఏక‌గ్రీవాలు జ‌రిగాయ‌ని గుర్తు చేశారు. 2002 నుంచి ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయితీ వస్తోందని.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా 19ఏ చట్టం తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.  చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను గౌరవించామని తెలిపారు.   సొంత జిల్లాలోనూ మెజారిటీ తెచ్చుకోలేని వ్యక్తి చంద్రబాబు. ఆయన ఏ రోజైనా ప్రజల కోసం పనిచేశారా?. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి దివంగత మహానేత వైయ‌స్సార్‌. పులివెందులలో ఆయన  ఒక్క రూపాయికే వైద్యం అందించారు. వైయ‌స్సార్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. అధికారులను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.  

Back to Top