వరదలను రాజకీయం చేస్తున్న టీడీపీ

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
 

కోనసీమ:  వరదలను టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు 80 టన్నుల పశుగ్రాసాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అందజేశారు. లంక గ్రామాల్లో ప్రభుత్వం 20 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top