నూత‌న స‌చివాల‌య‌, ఆర్‌బీకేల‌ను ప్రారంభించిన మంత్రి బొత్స‌

విజ‌య‌న‌గ‌రం: చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదం మండలం సాతంవలస గ్రామంలో నూత‌నంగా నిర్మించిన‌ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ప్రారంభించారు. సాతంవాలస వయా పెరుమాళి బి.టి రోడ్డు ను సత్తిబాబు ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనువాస రావు (చిన్నశ్రీను), బొబ్బిలి శాసన సభ్యులు సంబంగి చిన వెంకట అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Back to Top