వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించేందుకు ప్ర‌జ‌లు సిద్ధం 

మేం సిద్ధం..మా బూత్ సిద్ధం కార్య‌క్ర‌మంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) 
 

విజ‌య‌న‌గ‌రం: వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణే అందుకు నిదర్శమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. చీపురుపల్లి మండలం 18 సచివాలయాల్లో గల వాలంటీర్లు, బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులతో సోమ‌వారం మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)  పాల్గొని దిశానిర్దేశం చేశారు.  సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంత్, చీపురుపల్లి నియోజకవర్గం జెసిఎస్ ఇంచార్జ్ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డా బొత్స సందీప్, బెల్లాన వంశీ, మండలంలో గల ఇతర ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Back to Top