మాజీ మంత్రి కాకాణికి కోవూరు పోలీసులు నోటీసులు 

నెల్లూరు:  వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుమ్మళ్ళదిబ్బ మైనర్ బాలిక మృతి చెంద‌డంతో కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి బాలిక మృతదేహానికి నివాళి అర్పించి, ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. అయితే, ప్రభుత్వాన్ని  ప్రశ్నించడం, బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డం నేరం అంటూ ఆయ‌న‌పై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
 

Back to Top