కారా మాస్టారు మృతికి సీఎం వైయ‌స్‌ జగన్‌ సంతాపం

శ్రీకాకుళం: కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కధానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.  కాళీపట్నం రామారావు మృతిపై  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు.  చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా  కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ తన సంతాపాన్ని తెలియజేశారు.   

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top