ఏపీ సీఎం సహాయనిధికి విరాళం

 అమరావతి: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నవ్యాంధ్రప్రదేశ్‌ తరపున 1 కోటి 13 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. 285 నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ తరపున విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అసోసియేషన్‌ ప్రతినిథులు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కె మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ త్రినాథ్ తదితరులు ఉన్నారు.

Back to Top