వైయస్‌ఆర్‌సీపీ నేతలకు హోం మంత్రి సుచరిత పరామర్శ

గుంటూరు: టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైయస్‌ఆర్‌సీపీ నేతలను హోం మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్ప్రరులో గురువారం హోం మంత్రి పర్యటించారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

పక్కా ప్లాన్‌తోనే టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారని హోంమంత్రి  మేకతోటి సుచరిత మండిపడ్డారు.  కొప్పర్రులో వినాయక నిమజ్జనానికి వైయ‌స్సార్‌సీపీ నేతలు సహకరించారని తెలిపారు. టీడీపీ నేతలు ముందుగానే ఇంటిపై రాళ్లు సిద్ధం చేసుకున్నారని అన్నారు. బత్తుల శారద ఇంట్లోకి వెళ్లి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైయ‌స్సార్‌సీపీ నేత శ్రీకాంత్‌పై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని ఫైర్‌ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు భయానక వాతావరణ సృష్టించారని దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top