విశాఖకు బయలుదేరిని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

విజయవాడ: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున స్టైరిన్‌ గ్యాస్‌ లీకైన సంగతి తెలిసిందే. ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడ నుంచి విశాఖకు బయలుదేరారు. మధ్యాహ్నానానికి ఆయన విశాఖ చేరుకొని ఎల్జీ పాలిమర్స్‌ను పరిశీలిస్తారు. విష రసాయనం వ్యాపించిన గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే నిన్న రాత్రి బ్లాస్ట్‌ అవుతుందని వదంతులు పుట్టించడంతో ఇప్పటికే రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే పరిశ్రమల వివరాలను మంత్రి మేకపాటి తెప్పించుకున్నారు. పరిశ్రమల తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. 

Back to Top