విశాఖపట్నంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి టీడీపీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి వైయస్‌ఆర్‌సీపీలోకి విజయసాయిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కన్నబాబు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. బీఫామ్‌లు అందజేత విశాఖ కార్పొరేషన్‌కు పోటీ చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ఎంపీ విజయసాయిరెడ్డి బీ ఫామ్‌లు అందజేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.