టీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్‌లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు
20 May 2020 11:34 AM
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్ పరీక్షించగా 68 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. గత 24 గంటల్లో కొత్తగా 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్ కాగా, కరోనాతో ఇవాళ కర్నూలు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 715 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.