ఏలూరులో తాజా ప‌రిస్థితుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. అక్క‌డి తాజా ప‌రిస్థితుల‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షూ శుక్లా, ఆర్డీవో పనబాక రచన, డీఎంహెచ్వో డాక్టర్ సునంద ,   ప‌లు ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు, సైంటిస్టులు హాజ‌ర‌య్యారు. 

కాగా ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే విధంగా ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Back to Top