సంక్షేమ పథకాల వల్లే సుస్థిరాభివృద్ధి

సోషియో ఎక‌నామిక్ స‌ర్వే విడుద‌ల చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 అమ‌రావ‌తి: అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ఏపీ దేశ సగటు రేటు దాటిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ ప్రకటించారు. సోషియో ఎకనామిక్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేయగా.. ముఖ్యాంశాలను విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వ్యవసాయం రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు అయ్యిందన్నారు. సామాజిక, ఆర్థిక సర్వే 2021-22లో జీఎస్డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారాయన. పరిశ్రమల రంగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు అయ్యింది. తలసరి వృద్ధి రేటు కూడా రూ.31 వేలు పెరిగి.. 17.5 శాతం పెరిగింది. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ధి పెరిగిందని విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. 

 

  •  సామాజిక ఆర్థిక సర్వే 2021 -22లో జీఎస్‌డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగింది
  • అన్ని  రంగాల్లో అభివృద్ధి సాధించడంతో ఏపీ దేశ సగటు రేటు దాటింది
  • వ్యవసాయ రంగంలో 14.5 శాతం  ప్రగతి నమోదు - ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్‌
  • పరిశ్రమల రంగగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు
  • తలసరి వృద్ధి రేటు కూడా రూ.31 వేలు పెరిగి 17.5 శాతం పెరిగింది
  • వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ధి పెరిగింది
  •  
Back to Top