బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడకు వచ్చిన దత్తాత్రేయను కలిసిన సీఎం వైయస్‌ జగన్‌ ఆయన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు.. దత్తాత్రేయను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీని హిమాచల్‌ ప్రదేశ్‌ సంప్రదాయంతో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top