పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆందోళన..

వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త అరెస్ట్‌ పట్ల ఖండన..

చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం పీఎస్‌ ముందు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆందోళన చేపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త వేణుగోపాల్‌రెడ్డి అరెస్ట్‌ పట్ల ఖండించారు. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. రాజకీయ సర్వేలను అడ్డుకున్నందుకే అరెస్ట్‌చేశారని చెవిరెడ్డి ఆరోపించారు.దొంగతనం పేరుతో వేణగోపాల్‌రెడ్డిని చిత్రహింసలకు గురిచేశారన్నారు.

Back to Top