సీఎం వైయ‌స్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర దేశ చ‌రిత్ర‌లోనే ఓ రికార్డు అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ర‌ఘురాం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 16 సభలు, 9 రోడ్ షో లు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించామ‌న్నారు. 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేపట్టారని  తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌పై హత్యాయత్నం చేసిన వెనక్కి తగ్గలేద‌ని చెప్పారు. ప్రజల్లో సీఎం వైయ‌స్ జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో స్పష్టమైంద‌న్నారు. పగటి పూట సభలు పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. జనం రాక చంద్రబాబు బస్సులో గంటలకొద్దీ కూర్చుంటున్నాడన్నారు. విజయవాడ, విశాఖ రోడ్ షోలతో సీఎం వైయ‌స్ జగన్ విజయం ఎలా ఉండబోతోందో అర్థమైంద‌ని చెప్పారు.  జ్వరం, దగ్గు, జలుబు అని హైదరాబాద్ వెళ్లిపోయే పవన్‌కి సీఎం వైయ‌స్ జగన్‌ని విమర్శించే అర్హత లేదు. రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారు చేస్తామ‌ని వెల్ల‌డించారు. బస్సు యాత్ర కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామ‌న్నారు. ప్రజలు వైయ‌స్ జగన్ వెంట నడుస్తున్న తీరు ప్రతిపక్షాలకు వణుకు పుట్టిస్తోంద‌ని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అడ్రెస్ ఉండద‌ని త‌ల‌శిల ర‌ఘురాం పేర్కొన్నారు.

Back to Top