భీమవరం: `ఆ భగవంతుడు దయ వల్ల మా జగనన్నకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర ప్రజలంతా భావిస్తుంటే.. దుర్మార్గులు, దుష్టులు, మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి` అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో దాడి జరిగినప్పుడు జగనన్నను ప్రేమించే గుండెలు, అభిమానులంతా ఆవేదన చెందారన్నారు. నిరుపేదలను ఆ పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నందుకేనా జగనన్నపై ద్వేషం.. సంక్షేమ పథకాలతో పేదల జీవితాలను మారుస్తున్నందుకేనా జగనన్నపై కక్ష అని ప్రతిపక్షాలను నిలదీశారు. 16వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు. సీఎంపై దాడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. భీమవరానికి ఈ రెండు, మూడునెలల్లోనే రెండోసారి రావడం జరిగింది. భీమవరం నియోజకవర్గం మీద, పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్న సీఎం వైయస్ జగన్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నా.. చాలా తక్కువ సమయం మాట్లాడమన్నారు. 5 నిమిషాలు మాట్లాడటానికి కూడా నా నోరు పెగలడంలేదు. చాలా బాధగా ఉందన్నా.. ఇవాళ ఇన్ని లక్షల మంది మిమ్మల్ని దగ్గరగా వచ్చి అన్నా ఎలా ఉందన్నా మీకు? దెబ్బ తగిలింది ఆరోగ్యం ఎలా ఉంది? అని మీ శ్రేయోభిలాషులుగా అందరూ కూడా మీ శ్రేయస్సు కోరి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చేయి పట్టుకుని పలకరించాలని ఆప్యాయత, అభిమానాలతో వచ్చిన లక్షలాది జనమన్నా.. మీ అభిమానులన్నా వాళ్లందరూ. ఒక్క అవకాశం ఇవ్వన్నా వాళ్లందరూ వచ్చి మీ యోగక్షేమాల కోసం కనుక్కోవడానికి వచ్చిన అశేష జనం మీ చేయి పట్టుకుని వదలరన్నా. నిజంగా చాలా బాధగా ఉందన్నా రాజకీయాలు ఇంత దిగజారి పోతాయా అని. అన్నా.. రాయితో దాడి చేసి మీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకమంతా కూడా మీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీనవర్గాల వారు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, భావిభారత పౌరులు అనేకమంది పేదరికంలో ఉన్న ప్రతిఒక్కరూ కూడా మీ మీదే ఆశలు పెట్టుకున్నవారు అరె.. మీ కంటికి తగిలి ఉంటే కన్ను పోదును కదా, అరె..కొద్దిగా నవర కంత మీద తగిలి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడు దయ వల్ల మా జగనన్నకు ఏమీ జరగలేదని సంతోషిస్తుంటే దుర్మార్గులు, దుష్టులు, మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. నిజంగా దారుణం.. వాళ్లకి మంచి బుద్ధి పుట్టించమని భగవంతుడ్ని కోరుకుంటున్నా ఇన్ని లక్షల మంది సాక్షిగా. మంచి మనస్సు అన్నదే లేదు వాళ్లకి, నిజంగా మీ మీద ఎందుకన్న ఇంత ద్వేషం, ఎందుకన్నా మీ మీద అంత కక్ష. అవ్వాతాతలకు 65 సంవత్సరాలు వస్తే కానీ పెన్షన్ రానివాళ్లకు 60 సంవత్సరాలవాళ్లకే రూ.3 వేల పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారుజామున 5 గంటలకే వాళ్లందరికీ అందిస్తున్నందుకా?. భావిభారత పౌరులు మన పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్లకు విద్యను సంపదగా అందించాలి, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు రావాలని ఆలోచన చేస్తున్నందుకా మీ మీద అంత కక్ష?. ప్రతి పేదవాడికి, ప్రతి రైతుకి, ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా తమ కింది నుంచి ఎక్కడోచోట పనిచేసుకుని బతుకుతున్నవాళ్లందరూ కూడా మనం కూడా ఆత్మాభిమానంతో ఆర్ధికంగా పైకి ఎదిగి మనం గర్వంగా సగర్వంగా బతకాలని ఆలోచన చేస్తున్నవారికి మీరు చేయి అందిస్తున్నందుకా మీ మీద క్షక్ష. నిజంగా మీకు తగిలిన గాయం మాకు తగిలిన గాయం. పేదవాళ్ల ఆశలను చిదిమేయాలని చూస్తున్న దుర్మార్గులు, దుష్టులకి మంచి మనస్సుని కలిగించమని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ అన్నా నువ్వు పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలి, క్షేమంగా ఉండాలి మీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారన్నా. ఈ రాష్ట్ర ప్రజలు అవ్వాతాతల దగ్గర నుంచి పుట్టిన బిడ్డ వరకు కూడా వాళ్ల భవిష్యత్ కోసం నిజంగా చెప్పాలంటే అన్నా మీ గురించి 2 గంటలైనా సరిపోదన్నా. కానీ నాకు మాటలు రావడం లేదు మీరు పదికాలలపాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి వారిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి వాళ్లు సగర్వంగా ఆత్మాభిమానంతో తలెత్తుకుని తిరిగేలా మీరు చేయాలని కోరుకుంటూ ఈ లక్షలాదిమంది ఆశీర్వాదం మీకు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.