గోదావరిలో జనజాతర

ఎటు చూస్తే అటు పండుగ వాతావరణం. చిరునవ్వుల కేరింతలు..

తూర్పు గోదావ‌రి జిల్లా: సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు  విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా కొనసాగుతోంది. సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు.  రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్‌ వెంట ప్రయాణం చేస్తున్నారు.  

ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టిన గోదారి....
పిల్ల కాలువలతో మొదలుపెట్టి...

వాగులు, వంకలు, ఏరులు, నదులన్నీ ఇచ్చే శక్తితో పోటెత్తిపోతుంది...
‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కూడా అంతే!

ఇడుపుల పాయలో మొదలైన జనవాహిని కూడా..
అంతకంతకూ బలం పుంజుకుంటుంది...
ప్రతి సభ జన సంద్రాన్ని తలపిస్తోంది.

తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి,    
రాజానగరం మీదుగా ST రాజపురం చేరే..
నేటి యాత్రలోనూ గోదారోళ్ల అభిమానం, అప్యాయతలు కళ్లకు కడుతున్నాయి!

చిన్నా పెద్ద తేడా లేదు... రాజు పేద అన్న అంతరమూ కానరాదు.
ఎటు చూస్తే అటు పండుగ వాతావరణం. చిరునవ్వుల కేరింతలు..
పెత్తందార్లపై పోరుకూ మేమూ సిద్ధం అంటూ నినాదాలు!
ఈ ఉత్సవం... ఐదేళ్ల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుడుతున్నట్లే!

మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా వీధుల్లోకి పోటెత్తుతున్నారు.

కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి  వైయస్.జగన్ బస్సుయాత్ర 

కోత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్ చేరుకున్న ముఖ్యమంత్రి  వైయస్.జగన్ బస్సుయాత్ర.
బస్సుయాత్రకు మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలిపిన మహిళలు

'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా..

సీఎం వైయ‌స్ జగన్‌ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు.
తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్‌ మిల్‌ సెంటర్, దివాన్‌ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

Back to Top