విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 21వ రోజు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైంది. ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి భారీ జనసందోహం మధ్య వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. 21వ రోజు బస్సు యాత్ర మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటుంది. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సభ అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేరుకుంటారు. పీఎంపాలెం వైయస్ఆర్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత సీఎం వైయస్ జగన్‌ను చూసేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరి కాసేపట్లో సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర పీఎంపాలెం వైయస్ఆర్ స్టేడియం వద్దకు చేరుకోనుంది.