భూపట్టాలు ఇప్పించండి

క‌ర్నూలు: అవుకు మండలం మంగంపేట తండాకు చెందిన లంబాడీ మహిళలు గోవిందమ్మ బాయి, సాలమ్మ, కేశమ్మ, లక్ష్మి, రామక్క తదితరు లు వైయ్ జగన్‌ను బనగానపల్లె వద్ద కలసి సమస్యలు వివరిం చారు. అడవి హక్కుల చట్టం కింద భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇంతవరకు ఆ భూములకు సంబంధించి తమకు పట్టాలు ఇవ్వలేదని ఆ సంఘం నాయకులు మద్దిలేటి నాయక్, శ్రీరామ్‌ నాయక్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. తమ తండాకు రోడ్డు, బస్సు సౌకర్యం, పక్కా ఇళ్లు లేక సమస్యలతో సతమతమవుతున్నామని విన్నవించుకున్నారు. మ‌న పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైయ‌స్ జగన్‌ వారికి భరోసానిచ్చారు.
Back to Top