జననేతకు అంధుడి ఆశీర్వాదం

కృష్ణా: 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 125 సీట్లతో గెలుపొంది ముఖ్యమంత్రి అవుతారని అంధుడు ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా బోల్లపరాడు గ్రామానికి చెందిన అంధుడు వెంకటేశ్వరరావు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జననేతను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఇలాగే ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ.. సమస్యలన్నీ పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు. తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడిగా రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. అవినీతిని పారదోలి నిజాయితీ గల పరిపాలన అందిస్తాడని, ప్రతి జిల్లాలకు న్యాయం చేస్తాడన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top