వైయస్‌ జగన్‌ హామీలపై యువత హర్షం...


నిరుద్యోగులలో ఉత్సాహం నింపిన జననేత..

శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ హామీలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామనే హామీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు.గ్రామ సచివాలయాల్లో స్థానికులనే పది మందిని నియమిస్తామనే హామీ కూడా నిరుద్యోగులలో నూతన ఉత్సాహం నింపింది.యువతకు  ఉపాధి కలగడమే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.సంక్షేమ పథకాలు ప్రజలందరికి చేరేలా వైయస్‌ జగన్‌ ప్రణాళిక అద్భుతంగా ఉందన్నారు.  వైయస్‌ జగన్‌ ప్రకటనపై గిరిజన ఉద్యోగుల సంఘం హర్షం. జగన్‌ ప్రకటనతో నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని వైయస్‌ జగన్‌  హామీ పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగాల క్యాలెండర్‌ను రూపొందిస్తామని  ప్రకటించారన్నారు. నిస్తేజంగా ఉన్న యువత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీతో ఉత్తేజంతో ఉన్నారన్నారు.  జననేత మాకు అండగా ఉన్నారనే ధైర్యం కలుగుతుందన్నారు.వైయస్‌ జగన్‌ సీఎం అయితే ఉద్యోగాలు వస్తాయని యువత ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారన్నారు.
 
Back to Top