చిత్తూరు: పేదలకు ఇల్లు, ఆ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు నాయుడు మోసం చేశాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కొటాల క్రాస్ వద్ద వైయస్ జగన్‌ను కలిసిన మహిళలు వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ, పెన్షన్‌లు, రేషన్ అన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఇస్తున్నాడన్నారు. పూరిగుడిసెల్లో జీవిస్తున్నాం. చిన్న పిల్లలు స్కూల్‌కి ఏరుదాటిపోవాలి. తుమలుంకతండాలో అంగన్‌వాడీ లేదు, స్కూల్ లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. మా సమస్యలన్నీ జగనన్నకు చెప్పాం. మా సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు.