ఇళ్లు అడిగితే డబ్బులు అడుగుతున్నారన్నా..




విజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసి  హుద్‌హుద్‌ తుపాన్‌ బాధితులు తమ ఆవేదన వెళ్లబుచ్చారు. మూడేళ్లైనా తుపాన్‌ బాధితులకు ఇళ్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఇళ్ల జాబితా ప్రకటించి మళ్లీ రద్దు చేశారని ఆవేదన చేశారు. ఇప్పుడు ఇళ్లు అడిగితే డబ్బులు అడుగుతున్నారని వాపోయారు..మూడేళ్లుగా వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. స్థానిక ఎమ్మెల్యే గీత, ఎంపీ అశోక్‌ గజపతిరాజు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నామని తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.వైయస్‌ జగన్‌ మాత్రమే మాకు న్యాయం చేస్తారనే విశ్వాసం ఉందన్నారు.  ఆయన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నామని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందనే నమ్మకంతో బతుకుతున్నామన్నారు.
 
Back to Top