అమ‌రావతి ముసుగులో చంద్ర‌బాబు వేల కోట్ల అవినీతి  

స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి 

ధ‌ర్మ‌వ‌రం: అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు త‌మ ఫ్లాట్ ఎక్క‌డుందో చూపించాల‌ని కోరుతూ రెండేళ్లుగా రోజూ సీఆర్డీఏ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. గ‌తంలో ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రైతుల నుంచి సేక‌రించిన 50 వేల ఎక‌రాల‌ను త‌న బినామీల‌కు క‌ట్ట‌బెట్టేసిన చంద్ర‌బాబు రైతుల‌కు ప్లాట్లు ఇవ్వ‌కుండా గాలికొదిలేశాడు. ప్ర‌భుత్వం వ‌ద్ద భూములు లేవు. వచ్చిన రైతులంద‌రికీ అధికారులు కంప్యూట‌ర్ లో ప్లాట్లు చూపించి మాయ మాట‌లు చెబుతూ వ‌చ్చారు. అర‌కొర‌గా ఇచ్చినా అవ‌న్నీ కాలువ‌లు, గుంటల్లో ఉంటున్నాయి. కానీ టీడీపీ నాయ‌కుల‌కు మాత్రం లాట‌రీలో మంచి ప్రైమ్ లోకేష‌న్‌లో ప్లాట్లు ద‌క్కుతున్నాయి. దీంతో రైతులు చంద్రబాబు మీద తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో రెండో విడ‌త భూస‌మీక‌ర‌ణ‌కు చంద్ర‌బాబు నేతృత్వం లోని కూట‌మి ప్ర‌భుత్వం శ్రీకారం చుడితే భూములిచ్చేందుకు రైతులు అంగీక‌రించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తి రాజ‌ధాని అంటూ అసెంబ్లీ తీర్మాణం పేరుతో హ‌డావుడి మొద‌లుపెట్టాడు. చంద్ర‌బాబు చెబుతున్న క‌ట్టుక‌థ‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ గారు అధికారంలోకి వ‌స్తార‌ని, రాజ‌ధాని మారిపోతుంద‌ని ప్ర‌జ‌ల్లో భ‌యం క‌ల్పించే కుట్ర‌ల‌కు తెర‌లేపాడు. అమ‌రావ‌తి పేరుతో విచ్చ‌ల‌విడిగా చంద్ర‌బాబు దోచుకుంటున్న‌ట్టు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది. రూ. 47 వేల కోట్లు అప్పులు తెచ్చినా రాజ‌ధాని ప‌నుల్లో ఎక్క‌డా ముంద‌డుగు క‌నిపించ‌డం లేదు. కేవ‌లం అమ‌రావ‌తి డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు దోచుకున్నారు. ప్ర‌తి ప‌నిలోనూ నాలుగు కంపెనీలే అమ‌రావ‌తి టెండ‌ర్ల‌లో పాల్గొన‌డం చూస్తుంటే ఎన్నో అనుమానాలు క‌లుగుతున్నాయి. హైద‌రాబాద్, బెంగ‌ళూర్ వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో సైతం భూమితోపాటు ప్లాట్ల అభివృద్దికి రూ.10వేల‌కు మించి కావ‌డం లేదు. కానీ అమ‌రావ‌తిలో కేవ‌లం నిర్మాణాల‌కు రూ.11వేలు ఖ‌ర్చు చేస్తున్నారంటే ఎంత భారీ స్థాయిలో అవినీతి జ‌రుగుతుందో అర్థ‌మైపోతుంది. మొబిలైజేష‌న్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్ట‌ర్ల‌కు భారీగా దోచిపెడుతున్నాడు. అమ‌రావ‌తి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పుకుంటూ చంద్ర‌బాబు మాత్రం భారీగా దోచుకు తింటున్నాడు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు పూర్తి కావ‌డం చంద్ర‌బాబుకి ఇష్టం ఉండ‌దు. నిరంత‌రం ప‌నులు జ‌రుగుతుంటేనే ఆయ‌న‌కు క‌మీష‌న్లు వ‌స్తాయి. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ వేదిక‌గా అమ‌రావ‌తి కుట్ర‌ల్లో రెండో అధ్యాయానికి చంద్ర‌బాబు తెర‌లేపాడు. 

- అమ‌రావ‌తికి వైయ‌స్ఆర్‌సీపీ వ్య‌తిరేకం కాదు

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌కూడ‌ద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఏనాడూ చెప్ప‌లేదు. అమ‌రావ‌తి ముసుగులో జ‌రుగుతున్న విచ్చ‌ల‌విడి భూదోపిడీకి, అవినీతికి మాత్ర‌మే వైయ‌స్ఆర్‌సీపీ వ్య‌తిరేకం. ప్లాట్లు ఇచ్చిన‌ రైతుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపైనే మా పోరాటం. అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌న్నదే సంక‌ల్పంతోనే ఆయ‌న సంక‌ల్పం. 2028 నాటికే అమ‌రావ‌తిని పూర్తి చేస్తాన‌ని చెబుతున్న‌ప్పుడు మ‌ళ్లీ జ‌గన్ వ‌స్తాడ‌నే భ‌యం దేనికి? 15 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామ‌ని చెప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మాణం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? గ‌తంలోనూ అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో అసెంబ్లీలో తీర్మాణం చేశారు. జ‌గ‌న్‌ని కాల్చేయాల‌ని అచ్చెన్నాయుడు దిగ‌జారి మాట్లాడిన మాట‌ల‌ను ఎలా స‌మ‌ర్థిస్తారు? అప్పుడు చేసింది ఉత్తుత్తి తీర్మాణ‌మా?  వైయ‌స్ జ‌గ‌న్ గారిని తిట్ట‌డానికే అసెంబ్లీ పెట్టిన‌ట్టుంది. 6 గంట‌ల్లో క‌నీసం ప‌ది నిమిషాలైనా అమరావ‌తి కోసం తానేం చేశాడో చంద్ర‌బాబు చెప్పుంటే బాగుండేది. చివ‌రికి అమ‌రావ‌తిని కూడా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి వాడుకున్నారు. చంద్ర‌బాబు చెబుతున్న అమ‌రావ‌తి నిర్మాణం కోసం రూ.2 ల‌క్ష‌ల కోట్లు భ‌రించే శ‌క్తి రాష్ట్రానికి ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఇప్ప‌టికైనా రైతుల‌కు వాస్త‌వాలు చెప్పాలని కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top