వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే దమ్ముందా? 

 క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి స‌వాల్‌
 

క‌ర్నూలు: వైయస్ జ‌గ‌న్ గారిని తిట్టడం ద్వారా అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మించలేని త‌న చేత‌కానిత‌నాన్ని డైవ‌ర్ట్ చేయ‌డం కోసం అమ‌రావ‌తి రాజ‌ధాని బిల్లును అసెంబ్లీలో మాత్ర‌మే ప్ర‌వేశ‌పెట్టి మండలిలో పెట్ట‌లేదు. శాసన‌మండ‌లిలో అమరావ‌తి బిల్లు ప్ర‌వేశ‌పెడితే చంద్ర‌బాబు అవినీతి బాగోతం చ‌ర్చ‌కొస్తుంద‌ని, దాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నిల‌దీసి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతుంద‌నే భ‌యప‌డ్డారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పేరుతో జ‌రిగిన ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ గురించి మ‌రోసారి రాష్ట్ర ప్ర‌జ‌లంతా చర్చించే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. రైతుల‌కు ప్లాట్లు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్న దుస్థితి గురించి తెలిస్తే అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు బినామీలు చేస్తున్న‌ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ‌తింటుంద‌ని భ‌యం. అమ‌రావ‌తికి భూములిచ్చి ప్లాట్ల కోసం రెండేళ్లుగా సీఆర్డీఏ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న రైతుల క‌ష్టాల‌కు ప్ర‌భుత్వ సమాధానం చెప్ప‌లేక‌పోతోంది. మొబిలైజేష‌న్ అడ్వాన్సుల పేరుతో జ‌రుగుతున్న అవినీతికి స‌మాధానం చెప్పాలి. మొద‌టివిడ‌త‌లో సేక‌రించి 50 వేల ఎక‌రాల భూమి లెక్క‌లు చెప్పాలి. అమ‌రావ‌తి నిర్మాణం కోసం తీసుకొచ్చిన అప్పుల‌న్నీ ఏం చేశారో ఆ లెక్క‌ల‌న్నీ చెప్పాలి. వీట‌న్నింటికీ స‌మాధానం చెప్పే ధైర్యం లేక‌నే మండలిలో అమ‌రావ‌తి బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. అమ‌రావ‌తి రాజ‌ధానికి వైయ‌స్ఆర్‌సీపీవ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నాం. అమ‌రావ‌తి ముసుగులో జ‌రుగుతున్న భూపందేరం, అవినీతి వ్య‌వ‌హారాల‌ను మాత్ర‌మే ప్ర‌శ్నిస్తున్నాం. దానికి చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top