కృష్ణా జిల్లా :‘అన్నా.. నేను అగ్రికల్చర్ డిప్లొమో మొదటి సంవత్సరం చదువుతున్నా. విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేదు. మాది చాలా పేద కుటుంబం. మా తల్లిదండ్రులు రోజువారీ చార్జీలకు కూడా డబ్బు వెచ్చించలేకపోతున్నారు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ కాకపోతే రెండో ఏడాది చదువు మానేయాల్సి వస్తోంది’ అని విద్యార్థినులు స్వరూప, అనిత, రోహిణి జననేత వైయస్ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని వారు జగన్‌ను కోరారు.<br/>