అడుగు తీసి అడుగు వేయలంటే అవస్థలు

తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా రామచంద్రామపురం నియోజకవర్గంలోని కే గంగవరం మండలం గోపాలరావుపేట గ్రామస్థులు వైయ‌స్ జగన్‌ను కలిశారు. తమ గ్రామంలోని రోడ్ల దుస్థితిని గ్రామస్థులు వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అడుగు తీసి అడుగు వేయలంటే అవస్థలు పడుతున్నామన్నారు. స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు సమస్యగా మారిందని చిన్నారులు తెలిపారు. వైయ‌స్ఆర్‌ హయంలో తారు రోడ్డు వేశారని, ఆ తర్వాత రోడ్డు కొట్టుకుపోతే ఇప్పటి వరకు పట్టించుకునేవారు లేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వారు తెలిపారు.

Back to Top