అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడంలేదయ్యా...

రాజన్న బిడ్డకు వృద్ధ దంపతుల మొర..
విజయనగరంః అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడంలేదని వరలక్ష్మి,కృష్ణారావు దంపతులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టకున్నారు.  వైయస్‌ఆర్‌ హయాంలో ఇల్లు ఇచ్చారని, ఆడపిల్ల పెళ్ళికోసం ఆ ఇల్లును అమ్ముకోవలసి వచ్చిందని ఆ దంపతులు వాపోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నామన్నారు. కూలి పని చేసుకుంటామని మొరపెట్టుకున్నారు. 65 ఏళ్ల వృద్ధుడైన కృష్ణారావుకు కాలు,చేయి పడిపోయి 8 ఏళ్లుగా  జీవచ్ఛవంలా జీవనం గడుపుతున్నారు. వరలక్ష్మి కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి అని ఆమె వాపోయింది.పింఛన్‌ కోసం, టీడీపీ నేతలు, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగిన ఎంతమందికి పింఛన్లు ఇస్తామంటూ సూటిపోటు మాటలే తప్ప న్యాయం జరగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన న్యాయం చేస్తామని రాజన్నబిడ్డ వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారన్నారు. 
Back to Top