ప‌ట్టించుకునే నాథుడు లేడు

చంద్ర‌బాబు పాల‌న‌లో పేద‌ల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు. జ‌న్మ‌భూమి క‌మిటీలు చెప్పిన వారికే పింఛ‌న్లు, రేష‌న్‌కార్డులు అందుతున్నాయి. విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంద‌క చ‌దువులు మ‌ధ్య‌లో మానుకోవాల్సి వ‌స్తోంది. ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేయ‌డంతో పేద‌ల‌కు వైద్యం అంద‌డం లేదు. ఎవ‌రిని క‌దిలించిన ఇవే స‌మ‌స్య‌లు వినిపిస్తున్నాయి. యువ‌త ఆగ్ర‌హంతో మండిప‌డుతున్నారు. వారి మాట‌ల్లోనే..

రెండేళ్లుగా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ లేదు
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల ఉన్నత చదువులు ఆగిపోతున్నాయి. మేము ఐదుగురం అక్కాచెల్లెళ్లం. అమ్మా, నాన్నలు వ్యవసాయం చేసి కష్టపడి మమ్మలిని చదివిస్తున్నారు. పెద్దక్క డిగ్రీ చదువుతోంది, రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందలేదు. ఇలా అయితే మిగిలిన మేము ఎలా చదువుకోవాలో అర్థం కావడం లేదు. జగనన్న సీఎం అయితేనే పేదలు చదువుకుంటారనే నమ్మకం ఉంది.
–బి. స్వాతి, ఇంటర్, ఇందుకూరు, వీరపునాయనపల్లె  


జ‌గ‌న‌న్న సీఎం అయితే నా లాంటి వారికి పింఛ‌న్ వ‌స్తుంది
మూడేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. వితంతు పింఛన్‌ కోసం అప్పటి నుంచి 8 సార్లు అర్జీలు పెట్టుకున్నా. ప్రతి సారి అన్ని సర్టిఫికెట్లు, ఆ«ధార్‌ కార్డు ఇచ్చినా కొందరు కక్ష కట్టి పింఛన్‌ రాకుండా చేస్తున్నారు.  ఎంతో మంది నాలాగా అధికారుల చుట్టూ పింఛన్‌ కోసం పనులు మానుకుని తిరుగుతున్నారు. ఆ విషయమే జగనన్నకు చెప్పడానికి వచ్చాను. అన్న సీఎం అయితే నాలాంటి వారికి పింఛన్‌ వస్తుంది.
– ఎం.రాజమ్మ, వితంతువు, పాలగిరి

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో పింఛ‌న్ వ‌చ్చేది
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ. 200 పింఛన్‌ వస్తుండేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్‌ నిలిచిపోయిందని రామిరెడ్డిపల్లెకు చెందిన నాగమ్మ  (70)  జగన్‌కు తన గోడును వెళ్లబోసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందేలా కృషి చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

 
లోకేష్‌కు మాత్రం ఉద్యోగం వ‌చ్చింది
చింతకొమ్మదిన్నె/కడప సిటీ: ఎన్నికల సమయంలో బాబు వస్తే నిరుద్యోగులందరికీ జాబు వస్తుందన్నారని, దీంతోమాలాంటి నిరుద్యోగులు ఆశపడ్డారని రామిరెడ్డిపల్లెకు చెందిన లలిత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించింది. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎవరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తన కుమారుడు లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం ఇచ్చారన్నారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఉన్న ఉద్యోగాలు సైతం ఊడుతున్నాయని  ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.
Back to Top